పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనిలో కమ్యూనిటీ హాల్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ .. వేములవాడ లోని ఓల్డ్ అర్బన్ కాలనిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం అభినందనీయం అని అన్నారు.పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా వేములవాడ పట్టణం అభివృద్ధి,ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది అని తెలిపారు.ఈ నెల 21 నుండి ప్రతీ గ్రామాల్లో, పట్టణాల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుంది అని సూచించారు.10 సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న నూతన రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇళ్లను జనవరి 26 నుండి మంజూరు చెయ్యబోతున్నట్లుగా వారు తెలిపారు.ముంపు గ్రామాల ప్రజలకు 238 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది,ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా రైతులకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.భూమి లేని నిరుపేదలకు 12 వేల ఆర్థిక సహాయం..సమాంతరంగా వేములవాడ పట్టణ, రాజన్న ఆలయ అభివృద్ధి తెలిపారు. 47 కోట్లతో రోడ్డు వెడల్పు,77 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ,35 కోట్లతో అన్నదాన సత్రం ఏర్పాటు..రాజకీయాలకు అతీతంగా వేములవాడ నియోజకవర్గ అభిృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోనె అన్వేష్, కౌన్సిలర్లు సిరిగిరి చందు, నిమ్మ శెట్టి విజయ్, గోలి మహేష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజు, తోపాటు కాలనీ ప్రజలు తదితరులు ఉన్నారు.