నవతెలంగాణ – కంటేశ్వర్
శ్రీ రుక్మిణీ పాండురంగ రంగ విఠలేశ్వర పరివారం దేవతల 41వ మండల పూజలో 60 ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా టీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సోమవారం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మాక్లుర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయంలోని 41వ మండల పూజలో పాల్గొని పూజలు నిర్వహించారు. శ్రీ రుక్మిణీ పాండురంగ రంగ విఠలేశ్వర స్వామివారికి సుప్రభాతం సేవలు, అభిషేకం, గణపతి పూజ, స్వస్తి పుణ్యవాహచనం, నవగ్రహ మండపం ఆరాధన కలశ స్థాపన పూజ ఆవహిత దేవతల హోమం, పూర్ణాహుతి, మహా హారతి, మంత్ర పుష్పం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేసి 2000 మంది భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్,గ్రామస్థులు,భక్తులు పాల్గొన్నారు.