జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా కంటేశ్వర్ లో విగ్రహానికి పూల మాల వేసి నివాళులు బుధవారం అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డి సి ఐ సి చైర్మన్ రాజేశ్వర్, టిఆర్ఎస్ నాయకులు సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.