
నవతెలంగాణ – హుస్నాబాద్
ప్రజలందరూ పట్టణాన్ని స్వచ్ఛత లో ముందు ఉండి పట్టణాన్ని స్వచ్ హుస్నాబాద్ గా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్ర పోషించాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలో 20 వ వార్డ్ ప్రజల భాగస్వామ్యం తో స్వచ్ దీవాలి శుభ్ దీవాలి కార్యక్రమం నిర్వహించారు. రైతు బజార్, శివాజీ నగర్ ఏరియా లో రోడ్డు మీద బాణసంచా కి సంబంధించిన చెత్తను(హానికరమైన చెత్త) ను తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రజలు అందరూ కూడా గత ఏడాది కంటే ఈ సంవత్సరం బాణసంచా తక్కువగా కాల్చారని, పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు కృషి చేశారని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించేందుకు కృషి చేస్తున్న ప్రజలందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అనిత రెడ్డి,కౌన్సిలర్ వాల్ల సుప్రజ, కో ఆప్షన్ మెంబర్ లు శంకర్ రెడ్డి, ఆయుబ్ , మాధవ రెడ్డి, కొమురవెల్లి రవీందర్, సుధాకర్ రెడ్డి, పర్యావరణ అధికారి రవికుమార్, జవాన్ లు సారయ్య, ప్రభాకర్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.