ఉరేసుకుని వ్యాపారి ఆత్మహత్య

Navatelangana,Adilabad,Telugu News,Telangana,నవతెలంగాణ-లక్షెట్టిపేట
పట్టణంలోని పాతబస్టాండ్‌ ఏరియాలో శేశోద్యల ప్రతాప్‌ సింగ్‌(55) వ్యాపారి తన దుకాణంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్యతో కలిసి స్థానికంగా బొల్ల దుకాణం నడుపుతున్నాడు. గత కొంత కాలంగా వ్యాపారం సరిగ్గా సాగడం లేదు. అక్కడక్కడా అప్పులు కూడా చేసాడు. గత కొద్ది రోజులుగా ముగ్గురు వ్యక్తులతో ఎదో వ్యాపారం చేసి డబ్బు పొడగొట్టుకుని ఇబ్బంది పడ్డారు. తనకు కూడా బయట సుమారు రూ.కోటి వరకు రావాల్సి ఉంది. తనకు రావాల్సిన డబ్బు సమయానికి రాకపోగా తను తెచ్చిన చొట చెల్లించలేక పోతున్నానని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను ఇచ్చే అప్పు వివరాలు అదేవిధంగా తనకు ఇవ్వాల్సిన వాళ్ళా వివరాలు మొత్తం సూసైడ్‌ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య ఉమ పిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.