ఊరు రా నీటి పండగ

నవతెలంగాణ- రామారెడ్డి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలోని రామారెడ్డి, మద్దికుంట, రెడ్డి పెట్, అన్నారం, సింగరాయపల్లి, గొల్లపల్లి, కన్నాపూర్, కన్నాపూర్ తాండ, పోసానిపేట్, గోకుల్ తండా, ఉప్పల్ వాయి తో పాటు ఇసన్నపల్లి, మోషన్ పూర్, రంగంపేట గ్రామాల్లో నీటి పండగ సందర్భంగా మిషన్ భగీరథ నీటిని మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో తాగునీటి కటకటలు లేకుండా మిషన్ భగీరథ తో, ప్రతి ఇంటికి నీటిని అందించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. గ్రామ వాటర్ మెన్ లకు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచును, పంచాయతీ కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.