వర్షంలో ఉరుకులు.. పరుగులు..

Runs in the rain..– డెంగ్యూ, సీజనల్ వ్యాధులు..
– రోడ్లపై, మురికా కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకొవాలి..
– మేజర్ పంచాయితీని తనిఖీ..
– జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డెంగ్యూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, రోడ్లపై, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకొవాలి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు.గురువారం భారీ వర్షంలోను డిచ్ పల్లి మండల కేంద్రంలోని మెజర్ గ్రామ పంచాయతీ డిచ్ పల్లి, బర్దీపూర్, ధర్మారం(బి) మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మింగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ డెంగ్యూ, సీజనల్ వ్యాధులు రాకుండా రోడ్లపై, మురికి కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకొవాలని సూచించారు. మురికినీరు నిల్వ ఉన్నచోట ఆయిల్బాల్ వేయాలని  చెప్పారు. రోడ్డుకు ఇరువైపుల పిచ్చి మొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, చెత్తను డంపింగ్ యార్డుకు వెంటది వెంట తరలించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, మెజర్ గ్రామ పంచాయతీ గ్రేడ్ వన్ కార్యదర్శి నిట్టు కిషన్ రావు, సురేంద్ర మోగుల్లురు తోపాటు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.