
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈ నెల 21న ఉమ్మడి హుస్నాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలోని మత్స్యకారులు ఘనంగా నిర్వహించాలని సోమవారం ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. గ్రామాలలో అధ్యక్షులు,కమిటీసభ్యులు కలిసి పార్టీలఖతీతంగా కుంకుమ, పసుపు జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు.