నవతెలంగాణ – భువనగిరి
అక్రమ వలసదారులను ఏదేశ చట్టమైన అంగీకరించదు కానీ వలస దారులను తిరిగి ఆయాదేశాలకు పంపే విధానం తీవ్ర అభ్యంతకరంగా ఉన్నది. భారత వలస దారులను సరుకులు సరఫరా చేసే యుద్ధ విమానాల్లో కుక్కి తీసుకరావడం అమానుష మైనది అని దీన్ని ఖండిస్తున్నాం అని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ అన్నారు. ఆదివారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చేతులకు గొలుసులతో నిరసన వ్యక్తం చేసి అనంతరం వారు మాట్లాడుతూ.. అమెరికాలో వలస దారులుగా ఉన్న భారతీయులను కాళ్ళు చేతులకు సంకెళ్లు వేసి యుద్ధ ఖైదీల్లగా పంపించడం ఘోరం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
యుద్ధంలో పట్టుబడిన ఖైదీలను కూడా గౌరవంగా చూడాలని నిబంధనలు ఉన్నాయన్నారు. కానీ అమెరికా అధ్యక్షులు ట్రంప్ యుద్ధ నేరస్తుల్లగా వలస వాసుల పట్ల వ్యవహరించడం ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ అనుసరించిన ఆర్థిక విధానాలు, నిరుద్యోగాన్ని పెంచి పోషించడం వల్ల గత్యంతరం లేక భారతదేశ యువత వలస వెళ్తుందన్నారు. దీనికి ప్రధాన కారణం భారత నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరగటమే అని భారతీయ వలస దారులను గౌరవంగా తీసుకరావడం కోసం కేంద్ర ప్రభుత్వం భాద్యత వహించాలి అని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా, నిరుద్యోగ శాతాన్ని నిరుద్యోగాన్ని పెంచి పెంపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని వారు అన్నారు. వికసిత భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం సరిపోదని వారు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె మధుకృష్ణ, గడ్డం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి గణేష్,దయ్యాల మల్లేష్ ,సహాయ కార్యదర్శులు కవిడే సురేష్, ఎండి సలీం, మెట్టు శ్రవణ్, గుడ్డేటి సుర్జిత్, జిల్లా కమిటీ సభ్యులు చెన్న రాజేష్, రత్నం శ్రీకాంత్, వడ్డేమాను విప్లవ్ కుమార్, బోదాసు నరేష్, శానగొండ రాము, ఎస్ కె రియాజ్, పోగుల ఉపేందర్, గడ్డం కనుకరాజు, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఎండి నేహాల్ పాల్గొన్నారు.