నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు… ఓటు వేసేందుకు ఉపయోగించే మెషిన్లు. ఎన్నికలంటే బ్యాలెట్ పేపర్లు, వాటిని దాచిఉంచే బాక్స్‌లు, స్వస్తిక్ గుర్తు. ఇప్పుడీ పరిస్థితి మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందుకొచ్చిన నేపథ్యంలో ఈసీఐఎల్ సంస్థ ఈవీఎంలను తయారుచేసింది. గత ఎన్నికల్లో రూ.80 వేలతో తయారు చేసిన ఎం-2 ఈవీఎంలను వాడగా, తాజా ఎన్నికల్లో కేవలం రూ.20 వేలతో ఉత్పత్తి చేసిన ఎం-3 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మరింత వృద్ధి చేశారు. ఒక్కో ఈవీఎం 15 ఏండ్లపాటు పనిచేస్తుంది. ఓట్లు వేశాక 45 రోజులపాటు చెక్‌చెదరకుంటా ఉంటాయి. ఒక్కసారి వినియోగించాక రీసెట్ నొక్కితే మళ్లీ వాడుకోవచ్చు. ఒక్కో ఈవీఎంలో 2000 ఓట్లు నమోదవుతాయి. ఈవీఎంలతోపాటు రాష్ట్రంలో వీవీప్యాట్లను సైతం ఉపయోస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు నుంచి వీటిని తెప్పించారు. ఒక్కో ఈవీఎంలో 16 మంది నుంచి 64 మంది అభ్యర్థుల పేర్లు నమోదుచేసే అవకాశముంది. రాష్ట్రంలో 52,574 ఈవీఎంలు, 44 వేల వీవీప్యాట్లను వినియోగిస్తున్నారు. వీటికి తోడు 30 శాతం అదనంగా రిజర్వులో పెట్టారు.