రసాయన ఎరువుల వాడకం తగ్గించాలి: ఎఓ చంద్రిక

Use of chemical fertilizers should be reduced: AO Chandrikaనవతెలంగాణ – చండూరు
రైతు తమ పంట పొలాలలో రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని మండల ఏవో చంద్రిక రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని బంగారిగడ్డ రైతు వేదికలో రసాయన ఎరువుల వాడకం పైన వ్యవసాయ అధికారి చంద్రిక రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతులు డి.ఎ.పి నీ ఎక్కువ మొతాదులో వాడటం జరుగుతుంది అని, దీనివల్ల భూమిలో బాస్వరం ఎరువు మొక్కకు అందని స్థితిలోనికి వెళ్లడం జరుగుతుంది అనీ, దీని వలన పెట్టుబడి పెరిగి దిగుబడి తక్కువ రావడం జరుగుతుందన్నారు. డిఎపి కి బదులుగా పి.ఎస్.బి (బాస్వరాన్ని కరిగించే బాక్టీరియా)నీ, సూటి ఎరువులను గాని కాంప్లెక్స్ ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. అలాగే వరి పంట కోసినాక కొయ్యలను తగలబెట్టడం మంచిది కాదని దీనివలన మనుషులకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడం జరుగుతుంది అని తెలిపారు. భూమిలో ఉండే సారం తగ్గడం, భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు చనిపోవడం అలాగే వాతావరణ కాలుష్యం జరుగుతుంది అని రైతులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.