స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలి

– మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు
– ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం
– శెట్టిపల్లి గ్రామంలో సర్వ్‌ దివ్యాంగుల
– సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
స్వచ్ఛంద సంస్థల సేవలను సద్వినియోగం చేసుకుని లబ్ది పొందాలని మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం పిలుపునిచ్చారు. మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో శనివారం సర్వ్‌ వికలాంగుల సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా బస్‌ పాస్‌ లు, కుట్టుమిన్‌ మోటార్లు, దుప్పట్లు, విద్యార్థులకు నోటు బుక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్‌ ఎగిరిశెట్టి గోదాదేవి సత్యం హాజరై మాట్లాడారు. సర్వ్‌ వికలాంగుల సంస్థను ఆదర్శంగా తీసుకుని వివిధ రూపాల్లో సేవాకార్యక్రమాలు చేపడుతున్న స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న 120 మందికి పరీక్షలు నిర్వహించి వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేసినట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ టి.వెంకటయ్య, స్థానిక దివ్యాంగుల సంఘం నాయకులు శెట్టిపల్లి రామచంద్రయ్య, సర్వ్‌ దివ్యాంగుల సంస్థ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌, సొసైటీ ప్రెసిడెంట్‌ మీనాక్షి, సిబ్బంది శ్రీనివాస్‌, ధనలక్ష్మి, సురేష్‌, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.