
కాలనీల్లో సేకరించిన చెత్తను తడి చెత్త పొడి చెత్తలుగా వేరుచేసి రీసైక్లింగ్ చేయడానికి పట్టణంలోని మల్లారెడ్డి చెరువు ప్రాంతంలో లక్షలు వెచ్చించి సొంత భూమిని కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రీసైక్లింగ్ కోసం అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బంది కోసం మూత్రశాలలు, మరుగుదొడ్ల సైతం ఏర్పాటు చేసిన అధికారులు ప్రస్తుతం దానిని నిరుపయోగంగా వదిలేసి పెర్కిట్ జాతీయ రహదారి ప్రాంతంలో మరో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేశారు.దీంతో మల్లారెడ్డి చెరువు ప్రాంతంలోని డంపింగ్ యార్డ్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. 2010 సంవత్సరంలో ప్రభుత్వం మున్సిపల్ పరిధిలో డంపింగ్ యార్డ్ కోసం 1220/2 సర్వే నంబర్లో 11 ఎకరాల 9 గుంటల స్థల స్థలాన్ని ఏకరాన రూ .3 లక్షల చోపున కొనుగోలు చేశారు. ఆటు తర్వాత మున్సిపల్ అధికారులు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి రీసైక్లింగ్ కోసం పరికరాలు, సిబ్బంది కోసం గదులు మూత్రశాలలు,మరుగుదొడ్లు సైతం నిర్మించి ప్రస్తుతం డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా వదిలేశారు.
స్థల విషయంలోనూ వివాదం: డంపింగ్ యార్డ్ కు కేటాయించిన స్థలం విషయంలోనూ వివాదం కొనసాగుతోంది. 2010 సంవత్సరంలో 1220/2 సర్వే నంబర్ లోని 11 ఎకరాల 9 గంటల స్థలాన్ని స్థల యజమాని నుంచి డంపింగ్ యార్డ్ కు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదరగా ఎక రాన మూడు లక్షల చొప్పున కొనుగోలు చేశారు. కాగా పక్కనే ఉన్న మరో 12,,19సర్వే నంబర్ లోని స్థలాన్ని నాటి ఓ రెవెన్యూ అధికారి 2012 సంవత్సరంలో సర్వే నంబర్లను అటు ఇటుగా తారుమారు చేశారు. దీంతో మున్సిపల్ డాoపింగు యార్డ్ కు కొనుగోలు చేసిన స్థలం సర్వే నంబర్ లలో పేర్లు మార్చడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో సదరు బాధితులు పలుమార్లు జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ స్థల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి నిబంధనల ప్రకారం తమ సర్వే నంబర్లకు అనుగుణంగా తమ భూమిని తమకు కేటాయించని బాధితులు కోరుతున్నారు.
నిరక్షరాస్యుని చూసి మోసం చేశారు: 2010లో మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కు సర్వే నంబర్ 12,,20 లోని 11 ఎకరాల 30 గుంటల స్థలం అలార్ట్ అయింది. పక్కనే ఉన్న 12,,19 సర్వే నంబర్ లోని సుమారు 10 ఎకరాల నా సొంత స్థలాన్ని నా నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి 2012 సంవత్సరంలో సర్వే నంబర్లు తారుమారు చేసి నాకు తీరని అన్యాయం చేశారు. నా స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. నాకు రావాల్సిన డబ్బులు ఈ ప్పటికీ నాకు చెల్లించకుండా నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇకనైనా అధికారులు తప్పును సర్దిద్దుకొని నాకు న్యాయం చేయాలి.. సనుగుల గంగాధర్, బాధితుడు,ఆర్మూర్.