నిరుపయోగంగా డంపింగ్‌ యార్డు

– ఎస్సీ కాలనీ సమీపంలో పేరుకుపోయిన చెత్త
– జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎస్సీ కాలనీవాసులు
నవతెలంగాణ – కోహెడ
మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో డంపింగ్‌ యార్డు నిరుపయోగంగా మారిందని మంగళవారం ఎస్సీ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్‌, డీపీఓలకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో గత ఐదు సంవత్సరాల క్రితం డంపింగ్‌ యార్డు నిర్మించినప్పటికి నిరుపయోగంగా మారిందని ఫిర్యాదులో పేర్కోన్నారు. అలాగే నిర్మించిన షెడ్డులో ట్రాక్టర్లను, ఆవులను కట్టివెసేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తను, వ్యర్థలను ఎస్సీ కాలనీ ఇండ్ల సమీపంలో వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యర్థల దుర్వాసనతో కాలనీ వాసులు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటున్నామని వినతిపత్రంలో పేర్కోన్నారు. లక్షలు వెచ్చించి డంపింగ్‌ యార్డులను నిర్మించినప్పటికి వాటిని వినియోగించకుండా నిరుపయోగంగా ఉంచడంపై అంతర్యమేమిటన్నారు. దీనికి గాను సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరగా జిల్లా కలెక్టర్‌, డీపీవోలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు చిట్యాల అశోక్‌, చెప్యాల వెంకటయ్య, రమేష్‌, శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.