
– ప్రజాధనం దుర్వినియోగం?
– పాత బావులు, గుంతల్లో చెత్త పారబోత
– పట్టించుకోని పంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ – చివ్వేంల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్చభారత్, అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారేతప్ప ఆచరణలో అందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలనే సదుద్దేశంతో వీటి నిర్మాణం చేపట్టారు. కానీ ఎక్కడా వినియోగంలో ఉన్నట్లు కనిపించడం లేదు. చివ్వేంల మండల పరిధిలోని గ్రామాల్లో 31 డంపింగ్ యార్డులను నిర్మించారు. ఒక్కో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50లక్షలు ఖర్చు చేసింది. మండలంలో ఒకటి, రెండు గ్రామాల్లో మాత్రం డంపింగ్ యార్డులు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా అన్నిచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి….. డంపింగ్ యార్డ్ లో తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువులు తయారీ తో పాటు వానపాములను ఉత్పత్తి చేయాలని వీటిని నిర్మించారు. ఇక్కడ తయారైన ఎరువును రైతులకు విక్రయిస్తే పంచాయతీకి కొంత ఆదాయం సమకూరుతుంది. కానీ చెత్తతో ఎరువులు తయారు చేస్తున్న ఘటనలు ఏ ఒక్క గ్రామంలో మచ్చుకైనా కనిపించడం లేదు. డంపింగ్ యార్డ్లకు చెత్తను తీసుకురావడం గ్రామాల సమీపంలోని పాడుబడిన వ్యవసాయ బావుల గుంతల్లో పడేస్తున్నారు. అయినా పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.. డంపింగ్ వార్డులలో చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ, వానపాముల ఉత్పత్తి చేసే విధానం గురించి గతంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. పంచాయతీ కార్యదర్శులు దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది రూపాయల,ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన డంపింగ్ యార్డ్లను వినియోగించుకోలేకపోతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో ఊరు పొలిమేరల వద్ద, ఎస్సారెస్పీ కాలువల పక్కన చెత్త కుప్పలు దర్శనమిస్తున్న పట్టించుకునేవారే లేరని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డ్ నిర్మించడమే తప్ప వాటి వల్ల గ్రామపంచాయతీలకు ఎంత ఆదాయం సమకూరిందని, గ్రామ సభలలో తెలియజేసే అధికారులు లేరని విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఏర్పాటు చేస్తే హడావిడి చేసి డంపింగ్ యార్డ్ల వద్ద ఫోటోలు దిగి వెళ్లిపోవడమే తప్ప. డంపింగ్ యార్లు లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారా లేదా అనిఅటువైపు కన్నెత్తి చూసేవారు లేకుండా పోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు.. అంతా జిల్లా స్థాయి అధికారులకు తెలిసిన ముడుపులకు తలొగ్గి గ్రామపంచాయతీ కార్యదర్శులపైన చర్యలు తీసుకోకుండా వెనకేసుకొని వస్తున్నారానే విమర్శలు వినిపిస్తున్నాయి…ఇకనైనా పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులు ప్రజాధనం వృధా కాకుండా గ్రామాలలో తడి పొడి చెత్తలను సేకరించి, చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డ్లలో సేంద్రియ ఎరువులు తయారుచేసి రైతులకు అందించాలని పలువురు కోరుకుంటున్నారు.
డంపింగ్ యార్డ్లను నిరుపయోగంగా ఉంచకూడదు… ఎంపీడీవో సంతోష్: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజాధనం వృధా కాకుండా డంపింగ్ యార్డ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేయాలి. గ్రామాలలో తప్పనిసరిగా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలి.. డంపింగ్ యార్డ్స్ నిరుపయోగంగా ఉంటే చర్యలు తీసుకుంటాం.
డంపింగ్ యార్డ్లను నిరుపయోగంగా ఉంచకూడదు… ఎంపీడీవో సంతోష్: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజాధనం వృధా కాకుండా డంపింగ్ యార్డ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేయాలి. గ్రామాలలో తప్పనిసరిగా తడి పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించాలి.. డంపింగ్ యార్డ్స్ నిరుపయోగంగా ఉంటే చర్యలు తీసుకుంటాం.