– క్రీడాకారులకు అందని శిక్షణ
– స్టేడియం పరిసరాల్లో బీరు బాటిళ్లు, పగిలిన సీసాలు
– 14 ఏండ్ల నుంచి క్రీడాకారులకు నోచుకోని స్టేడియం
– పట్టించుకునే నాథుడే లేరు ప్రభుత్వం స్పందించాలి క్రీడాకారులు
ఆటలు ఆడి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కొందరు, క్రీడల్లో పాల్గొని పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకుని ఉన్నత స్థానంలో ఉండాలని కొందరు స్టేడియానికి వస్తుంటారు. ఆశయాలను సాధిం చాలని గంపెడంత ఆశతో వస్తున్న వారికి సౌకర్యాలు కరువై సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. లక్షల్లో నిధులు వచ్చినా.. అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని పలువురు అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా క్రీడాకారుల నైపుణ్యం కనుమరుగవుతుందని స్థానికులు వాపోతున్నారు.
నవతెలంగాణ-కందుకూరు
ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నై పుణ్యమున్న క్రీడాకారులను వెలిగి తీసేందుకు, ఉ త్తమ ప్రదర్శన కనబరచిన వారికి ప్రశంసా పత్రా లు అందజేయడానికి కందుకూరు మండల కేం ద్రంలో హైదరాబాద్, శ్రీశైలం జాతీయ ప్రధాన ర హదారికి అతిదగ్గరలో మినీస్టేడియం నిర్మించా రు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి ఉన్న సమయంలో 2008 సంవత్సరం జనవరి నెలలో శంకుస్థాపన, 2010 సంవత్సరం మార్చి 10న హెచ్‌ఎండీఏ రూ.46 లక్షల నిధుల తో అప్పటి ప్రభుత్వంలో గనుల భూగర్భశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుండి కొన్ని నెల లపాటు అప్పుడు, అప్పుడు, కొంతమంది క్రీడలు క్రీడలు నిర్వహించుకున్నారు. ప్రస్తుతం స్టేడియం నిరూపయోగంగా ఉంది. స్టేడియం ఆవరణలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, బ్యాడ్మింటన్, షా ట్‌ఫూట్ క్రీడలు ఆడటం కోసం ఇక్కడ ఎంతో అ నువైన క్రీడా మైదానం ఉంది. ఈ క్రీడా మైదా నం లో ఒక్క భవనం నిర్మించారు. ఈ మైదానానికి ర క్షణ లేనందున భవనంలోనే ఫర్నిచర్, కిటికీలు, త లుపులు లేకుండా పోయాయి. ఆకతాయి ఇక్కడే మద్యం సేవించి బీరు బాటిల్స్ పగలగొట్టి ఉ న్నా యి. క్రీడా పరిసరంలోని గోడచుట్టు పిచ్చి మొక్క లు, గేట్ దగ్గర కంపచెట్లు ఎక్కువగా ఉన్నాయి. బాత్‌రూములలో చెత్తాచెదారంతో నిండి ఉంది. గోడలపైన పిచ్చి రాతలు రాసి ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో సాధన చేసేందుకు క్రీడామైదానాన్ని ఉ పయోగం లేనందున క్రీడా మైదానం నిరుపయో గమైందని క్రీడాకారులు అంటున్నారు. క్రీడాకారు లకు శిక్షణ ఇచ్చేవారే కరువయ్యారని క్రీడాకా రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రోత్సహించి క్రీ డాకారులను వెలికితీయాలని వారు కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
ప్రభుత్వం ప్రోత్స హిం చాలి. క్రీడాకారులను పట్టిం చుకోవాలి. ప్రభుత్వం శ్రద్ధ వహించి ప్రతి పాఠశా లకూ పీఈటీలను నియమించి వి ద్యార్థులకు క్రీడా రంగాలలో రాణించడానికి కృషి చేయా లి. ఒక పక్కగోడ లేనందున గ్రామ పంచాయతీ చెత్తాచెదారం అక్కడే వేస్తున్నారు. క్రీడలశాఖ క్రీ డాకారులకు గదులు ఏర్పాటు చేసి మండల స్థా యిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. క్రీడాకారులను ప్రోత్సహించాలి. – ఢిల్లీ శివ, ప్రయివేటు పీఈటీ
ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది
క్రీడాశాఖనే లేకుండా చేశారు. ప్రభుత్వ ప్రోత్సా హం కరువైంది. క్రీడా శాఖ మంత్రినే ఇప్పటివరకు కాం గ్రెస్ ప్రభుత్వం నియమిం చలేదని, గత ప్రభుత్వాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాయని, మారుమూల గ్రామాలలో తండాల లో ప్రావీణ్యం కలిగినటువంటి క్రీడా కారులను వెలిగి తీసేందుకు గత ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయి. క్రీడాకారులకు ప్రోత్సా హం లేనందునే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు మట్టి లో కలిసిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి క్రీ డాకారులకు ప్రోత్సహించి, నిరుపయోగముగా ఉన్న స్టేడియాన్ని అందుబాటులోనికి తీసుకు రావాలని కోరారు.
– రాయికంటి ఆనంద్