అభివృద్ధి చేసిన ఎర్రబెల్లిని ఆదరించాలి: ఉషాదయాకర్ రావు

– ప్రజలందరూ దయాకర్ రావు కే పట్టం కట్టాలి

నవతెలంగాణ- పెద్దవంగర: నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు,  పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆదరించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని చిన్నవంగర, పెద్దవంగర, గంట్లకుంట గ్రామాల్లో దయాకర్ రావు గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేపట్టారు. తొలుత చిన్నవంగర ఎంపీటీసీ మెట్టు సౌజన్య నగేష్ ఇటీవల హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, మీ సేవకుడిగా పనిచేసే ఎర్రబెల్లిని అత్యదిక మెజారిటీతో గెలిపించాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం, ప్రాంత సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలుగా కష్టపడే నాయకుడు ఎర్రబెల్లికి ప్రజలు పట్టం కట్టాలన్నారు. అత్తా కోడళ్ళు మాయమాటలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేసే నాయకులు కావాలా? అమెరికా వెళ్ళే నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటిముందు ఉన్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఎర్రబెల్లి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పెద్దవంగరలో మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, గంట్లకుంట గ్రామంలో సీనియర్ నాయకులు పాలకుర్తి యాదగిరిరావు ఆధ్వర్యంలో జోరుగా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాకనాటి సునీల్ రెడ్డి, రైతు సమితి మండల కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, సర్పంచ్ జలగం పద్మ, శేఖర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ జలగం వెంకటయ్య, యూత్ నాయకులు శివరాత్రి సోమనర్సు, జలగం యాకయ్య తదితరులు పాల్గొన్నారు.