
పంటల కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ చట్టాల సవరణ, స్వామినాథన్ సిఫారసుల అమలు కొరకు గత కొద్ది రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా, ఈ నెల 16 న (ఈరోజు) రైతు, కూలీ, కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు యూఎస్పిసి మద్దతిస్తుంది.అందులో భాగంగానే శుక్రవారం నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద యుఎస్పీసి ఆధ్వర్యంలో సంఘీభావ ప్రదర్శన జరిగింది.ఈ సందర్భంగా యూఎస్పి సీ స్టీరింగ్ కమిటీ నాయకులు పి. శంతన్, ,వై. విజయ్ కుమార్, సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కు చట్టబద్ధత కల్పించడం,విద్యుత్ చట్టాలను సవరించడం,స్వామి నాథన్ సిఫారసులు అమలు చేయడం ద్వారా వ్యవసాయరంగం అభివృద్ధి చెందుతుందని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి రైతులపై జరిపే దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు సిపిఎస్ అండ్ పి ఎఫ్ ఆర్ డి ఏ లను రద్దు చేయాలని, ఆదాయపన్ను శ్లాబులు సవరించి, పన్ను రాయితీ పరిమితి పెంచాలని, ఎన్ ఈ పి-2020 ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు .ఆ మేరకు రైతు, కార్మిక సంఘాల సమ్మెకు యుఎస్పీసి సంఘీభావం తెలుపుతున్నదని తెలిపారు. ఈ ప్రదర్శనలో జి. సుధా o, పెంటన్న, కిషన్, అరవింద్, రాజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.