నవతెలంగాణ- ఆర్మూర్
తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షులు బట్టు స్వామి ,,ఎన్ఆర్ఐ ఉపాధ్యక్షులు గురాయి రాజేంధర్ ,ఎన్ ఆర్ ఐ కువైట్ ఉపాధ్యక్షులు గున్నల విక్రమ్ ,ఎన్ఆర్ఐ సౌదీ ఉపాధ్యక్షులు పీర్ల దేవదాస్ (కురుమ) ఆధ్వర్యంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ సౌదీ దర్పల్లి మండల అధ్యక్షునిగా ఉట్నూర్ గంగదాస్ ని నియమించబడినది. ఉట్నూర్ గంగదాస్ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఆర్ఐ అధ్యక్షుల వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని బిసి ఎన్ఆర్ఐ లకు ఎటువంటి సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటానని ఎల్లవేళల సంక్షేమ సంఘం కోసం పాటుపడతారని ఉట్నూర్ గంగదాస్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీసీ అధ్యక్షులు బట్టు స్వామి మరియు ఉపాధ్యక్షులు గురాయి రాజేంధర్ ఎన్ ఆర్ ఐ కువైట్ ఉపాధ్యక్షుడు గున్నల విక్రమ్ సౌదీ ఉపాధ్యక్షులు పీర్ల దేవదాస్ (కురుమ) బీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.