దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకుడు హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు. బ్రహ్మానందం, నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. బ్రహ్మానందం మాట్లాడుతూ, ‘నటులు, నట జీవితం అంటే నాకు ఒక ఎమోషనల్ ఎటాచ్‌మెంట్. ఆర్ట్ ఈజ్ లాంగ్.. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే. కళా కారులందరినీ ఒక్క చోటికి చేర్చి వీరిపై ఒక సినిమా చేయాలని ఆలోచన చేసిన దర్శకుడు అర్జున్ సాయికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఎన్నుకోవాలంటే ధైర్యంతో పాటు సినిమాటిక్‌గా చెప్పే నేర్పు కావాలి. దర్శకుడు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అందరూ అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజంగా ఈ సినిమా ‘ఉత్సవం’లా ఉంటుంది. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది’ అని అన్నారు. ‘కలర్‌పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్ సినిమాతో పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది’ అని హీరో దిలీప్ చెప్పారు. ‘సినిమాకి మూలమే నాటకరంగం. ఈ టీజర్‌లోని మొదటి డైలాగే చాలా ఆకట్టుకునేలా ఉంది. ఇంతమంది లెజెండరీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా విశేషం’ అని నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ, ‘దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. టీజర్ లాంచ్ చేసిన బ్రహ్మానందం, నిర్మాత ఏఎం రత్నంకి కతజ్ఞతలు’ అని చెప్పారు. ఎల్. బీ శ్రీరామ్ మాట్లాడుతూ, ‘నాటకానికి సంబంధించి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా వస్తోంది. సినిమా చాలా బావుంటుంది. నాటకం అమ్మలాంటింది. నాటకం నుంచి పుట్టిన అనేక రూపాలే నేటి కళారూపాలు. తల్లిని గౌరవించినపుడే మనకి కూడా ‘ఉత్సవం’ అని అన్నారు.
‘ఇదొక హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. ఇందులో చాలా పాటలు ఉన్నాయి. నేను చేసిన సినిమాల్లో ఉత్సవం కూడా మంచి ఆల్బమ్ అవుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు.