నవతెలంగాణ- ఖమ్మం
ఉత్తరాంచల్ యూనివర్సిటీ రీజినల్ కార్యాలయంను ఖమ్మంలోని పాత సిపిఐ బిల్డింగ్ కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తులో శనివారం ప్రారంభించారు. కార్యాలయాన్ని 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వై.విక్రమ్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంచల్ యూనివర్సిటీ రీజినల్ కార్యాలయాన్ని ఖమ్మం నగరంలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని విద్యా సంబంధిత విషయాలను తెలియజేస్తూ వారికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లాలోని ఇంజనీరింగ్ విద్యార్థుల సౌకర్యం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. మరిన్ని వివరాలకు 88866 61866, 88868 61866 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సయ్యద్ ఖదీర్, ఉత్తరాంచల్ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్టనర్ శీలం రామకృష్ణారెడ్డి, వెంకీస్ కంప్యూటర్స్ యజమాని వెంకీ నాయుడు, యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.