చతిస్గడ్ రాష్ట్రం బీజాపూర్ కి చెందిన ఎన్ డి టీవీ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ హత్యను భారత యువజన సమాఖ్య (యువైఏప్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్, టీయూడబ్ల్యూజె (ఐజేయు)భూపాలపల్లి జిల్లా కోశాధికారి చింతల కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆదివారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు దేశంలో నానాటికి పత్రిక స్వేచ్ఛ దిగజారుతున్నదని నిజాన్ని నిర్భయంగా వెల్లడించే జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని దీంట్లో భాగంగానే చంద్రకర్ హత్య జరిగిందని పేర్కొన్నారు. చత్తీస్గడ్ రాష్ట్రం బస్తర్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడి ఆదివాసి ప్రజలపై ప్రభుత్వాలు కొనసాగిస్తున్న మారణకాండను, అభివృద్ధి పేరుతో రాష్ట్రంలోని ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న విధానాన్ని తన వార్తలు ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాడన్నారు. ఆదివాసులపైన దళితుల పైన, మైనార్టీల పైన మిషనరీలపైన జరుగుతున్న దాడులను వార్తల రూపంలో చూపిస్తున్నాడని తెలిపారు.120 కోట్ల రహదారి నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసినందుకే అతన్ని ప్రభుత్వం హత్య చేసిందని, ఇందులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమి లేదని,సదరు కాంట్రాక్టర్ అక్కడి బిజెపి ప్రభుత్వమే ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు గత ఏడాది ఫ్రాన్స్ కు చెందిన రిపోర్టర్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో 180 దేశాలకు గాను భారతదేశం 159 స్థానంలో ఉన్నదని, పత్రికా స్వేచ్చ తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల్లో భారత్ కూడా ఉండడం, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్లో ఈ పరిస్థితులు ఇబ్బందికరమన్నారు.దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పత్రిక స్వేచ్ఛ కోసం ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ది హిందూ ఎడిటర్ రామ్, హక్కుల నాయకులు ప్రశాంత్ భూషన్ లు సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని మరవరాదన్నారు. ప్రభుత్వ విధానాలు ప్రశ్నించినందుకు గతంలో కల్బురి , గౌరీ లంకేష్ మొదలు ఇప్పుడు చంద్రకర్ వరకు ఎందరో జర్నలిస్టులు అసలు బాసారన్నారు. గతంలో గుజరాత్ మారణహోమం గురించి ప్రసారాలు చేసినందుకు బీబీసీ యాజమాన్యంపై ఐటి దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేసారని, ది హిందూ, ది వైర్, న్యూస్ క్లిక్ మీడియాలకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయని తప్పులు కేసులతో అనేక ఆంక్షాలు విధించారని అన్నారు..ఇప్పటికైనా దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పైన పైన జరుగుతున్న దాడులను, హత్యలను అరికట్టాలని, జర్నలిస్టుల భద్రత కోసం కఠినమైన ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఫ్రీలాన్స్ జర్నలిస్టు చంద్రకర్ హత్య కేసు నిందుతులను కఠినంగా శిక్షించాలని, మృతుడు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.