ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు భర్తీ చేసి, మెగా డీఎస్సీ ద్వారా 24 వేల ఉద్యోగాలతో భర్తీ చేసి డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సమీపంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ప్ల కార్డులు ప్రదర్శించి శాంతియుత ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలకు డిసెంబర్ వరకు సమయం పొడిగించాలని, గ్రూప్ 3, 3000, గ్రూప్ 2, 2000 ఉద్యోగాలతో భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఆటంకంగా పరిణమించిన 46 జివోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నిరుద్యోగ వ్యతిరేక విధానాలను పదేళ్ల బిఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ కు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల హామీలో ప్రకటించిన మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వెంకన్న, జేఏసీ నాయకులు పి, శ్రీనివాస్, వి, శ్రవణ్ పి, నరేష్, సిహెచ్, విఠల్,సత్య, భవానీ, జ్యోత్స్న, నజియా తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్