జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్స్, అయ్యా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా ఉపాధి కల్పన అధికారి మిల్కాను ఆమె కార్యాలయంలో కలిసి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఖాళీ పోస్టులను అర్హులైన నిరుద్యోగ యువతులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఉపాధి కల్పనాధికారి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.