
గాలికుంటు వ్యాధి నివారణ టీక కార్యక్రమం శంకరపట్నం మండల పరిధిలోని అంబాల పూర్ గ్రామంలో బుధవారం పశు వైద్యురాలు డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీజన్లలో వచ్చే వ్యాధులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకా ముందస్తు నివారణ చర్యగా 101 పశువులకు పశువైద్యులు డాక్టర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సహయకురాలు మౌనిక, అటెండర్ లలిత,గోపాల మిత్ర సంపత్,పశు మిత్ర లక్ష్మణ్, మరియు పాడి రైతులు పాల్గొన్నారు.