
నవతెలంగాణ – ధర్మారం
మండలంలోని రైతులందరూ తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలని పెద్దపల్లి జిల్లా పశుసంవర్ధక శాఖ వైద్య అధికారి డాక్టర్ బి శంకర్ అన్నారు. మండలంలోని ఖిలావనపర్తి గ్రామంలో గురువారం రోజు పశు వైద్య ఉపకేంద్రాన్ని ఆకస్మిక తనకి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో గాలికుంటు వ్యాధి ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గాలికుంటు వ్యాధి టీకాలు వేయాలని పశు వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రతి గ్రామంలోని రైతులు తమ పశువులను గాలి కుంటు వ్యాధి బారిన పడకుండా తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణకు టీకాల ఉచిత వైద్య శిబిరం ఉపయోగించుకొని పశువులకు తప్పనిసరిగా వేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ అజయ్ కుమార్, వి ఎల్ ఓ ఇబ్రహీం షరీఫ్, వెటర్నరీ అసిస్టెంట్ అహ్మద్ పాషా, జె వీ ఓ పి, రాజేందర్,ఋ గోపాల మిత్రలు రాజేశం, వెంకటేశం మల్లేశం పశు వైద్య సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.