గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

Vaccination for the prevention of Galikuntu disease in the villageనవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని కొలి  గ్రామంలో పశువులకు గాలి కుంటూ నివారణ టీకాలు మంగళవారం ఇచ్చారు. గ్రామంలోని 535 గేదెలకు, 152 ఆవులకు గాలికుంటు నివారణ టీకాలను ఇచ్చినట్లు మండల పశువైద్యాధికారి శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వైద్యాధికారి శశిరేఖ, పశువైద్యశిబ్బంది అనిల్, గోపాల మిత్రులు రాజ్ కుమార్, పద్మారావు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.