లక్ష్మాపూర్ లో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి శిరీష శనివారం తెలిపారు. పశువులకు గాలికుంటు నివారణే టీకాలు ఇస్తే ఆరోగ్యంగా ఉంటాయని మండల పశువైద్యాధికారి శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది అశోక్ రైతులు తదితరులు ఉన్నారు.