పశువులకు గాలికుంటు వ్యాది నివారణ టీకాలు: చంద్రబాబు

నవతెలంగాణ – పెద్దవూర
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ, ఇతర వ్యాధి నియంత్రణ టీకాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మండల పశువైద్య అధికారి చంద్రబాబు తెలిపారు. గురువారం మండలం లో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలం లో పశువులకు వ్యాధి నియంత్రణ టీకాలు వేసేందుకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 10 వరకు కార్యాచరణ రూ పొందించామని అన్నారు. గోపాలమిత్రులు సమన్వయంతో రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు.
పశువులకు సీజనల్ వ్యాదులు రాకుండా రైతులు తప్పకుండ వ్యాది నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని అన్నారు.