
నవతెలంగాణ – భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం రోజు గ్రామపంచాయతీ పాలకవర్గం నేటితో వారి కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ , టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ ల ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులను మరియు కోఆప్షన్ సభ్యులను ఘనంగా శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా మనీష్ గౌడ్ మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి, నాకు సహకరించిన వాడు సభ్యులకు కోఆప్షన్ సభ్యులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి సుమారు ఒక కోటి 93 లక్షల నిధులతో గ్రామ పంచాయితీకి వేచించి వడాయిగూడెం గ్రామాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా లోనే ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధితోపాటు సర్పంచ్ మనీష్ కు కరోనా కష్టకాలంలో గ్రామ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నందున కరోనా వారియర్ అవార్డును అందుకోవడం జరిగింది. గత వారం రోజుల క్రితం మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, గ్రామ స్మశాన వాటిక ఆవరణలో మహా శివుని విగ్రహాలను ఆవిష్కరించుకోవడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో గ్రామంలో అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, వీధి దీపాలు, ఓపెన్ జిమ్, మహిళా భవనం, వ్యాయామశాల, పీర్ల గొట్టం, క్రీడా ప్రాంగణం, షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీ, ప్రకృతి వనం, స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో సుమారు 5వేలకు పైన మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ముఖ్యంగా గ్రామదేవత ఆయన దుర్గమ్మ తల్లి గుడి పునర్నిర్మాణం చేసుకోబోతున్నామని చెప్పారు. గ్రామ పెద్దల సహకారంతో ఈ ఏడాది దుర్గమ్మ తల్లి మొదటి పండుగను ఘనంగా జరుపుకోబోతున్నట్లు గ్రామస్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మనీష్ గౌడ్ , టి యు డబ్ల్యూ జే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్, ఉప సర్పంచ్ నీల పోశెట్టి, వార్డు సభ్యులు బబ్బురి సాగర్, పబ్బాల మాధవి, శెట్టి సంతోష, పబ్బాల రమేష్, కోట పోచయ్య, కోఆప్షన్ సభ్యులు కళ్లెం కృష్ణ గౌడ్, ఎశబోయిన లక్ష్మి, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆమని గ్రామ సిబ్బంది పాల్గొనడం జరిగింది. గ్రామాభివృద్ధికి సహకరించిన దాతలు స్వర్గీయ గుండు బిక్షపతి గౌడ్ జ్ఞాపకార్థం 15 లక్షలతో స్వాగత ద్వారం నిర్మాణం, నాలుగు లక్షలతో బబ్బురి సురేష్ గౌడ్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఫ్లోరింగ్ నిర్మాణ పనులు, జక్కుల చంద్రయ్య తెలంగాణ తల్లి విగ్రహ దాత, కళ్లెం కృష్ణ గౌడ్ స్మశాన వాటికలో పరమశివుని విగ్రహం, స్వర్గీయ గుండు యాదగిరి గౌడ్ జ్ఞాపకార్థం 7 లక్షల రూపాయలతో దర్గా నిర్మాణం, ముద్దసాని వెంకటేష్ గౌడ్ తన తండ్రి గారైన స్వర్గీయ సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం మహాత్మా గాంధీ విగ్రహం, బబ్బురి పోశెట్టి గౌడ్ సర్దార్ సర్వాయి పాపన్న ఇలా అభివృద్ధి పదంలో ముందుకు వచ్చిన దాతలకు గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.