స్వాతంత్ర పోరాటంలో వడ్డే ఓబన్న వీరోచిత పోరాటం భావితరాలకు చాటి చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. శనివారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న 218 వ జయంతి వేడుకలలో పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓబన్న 1840 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశారు. ఈ ఉద్యమానికి ఓబన్న చిన్న , సన్నకారు ,మధ్యతరగతి రైతులను సంచార జాతుల వారితో సుమారు పదివేల మందిని కూడగట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పేద రైతుల పక్షాన నిలబడి విరోచిత పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి , జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ జడ్పీ సీఈఓ శోభారాణి ,ఆర్ డి ఓ లు, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి,జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, జిల్లా అధికారులు బి సి కుల నాయకులు , సిబ్బంది పాల్గొన్నారు.