నవతెలంగాణ – తొగుట
వడ దెబ్బకు గురై వడ్డె యాదయ్య మృతి చెందడం బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి అన్నారు. మండలం లోని వెంక ట్రావుపేట గ్రామానికి చెందిన వడ్డె యాదయ్య శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలు సుకున్న మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి శనివారం మృతదేహానికి నివాళి అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం అందించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.4 వేలు ఆర్ధిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటున్న యాదయ్య మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, బూత్ అధ్యక్షులు డబ్బికారి పెంటొజి, పిట్ల వెంకటయ్య, నాయకులు సుతారి రాములు, బండారు స్వామి గౌడ్, పాత్కుల బాలయ్య, ఈదుగళ్ల పర్శరాములు, కంకనాల స్వామి, ఎంగలి సత్తయ్య, పులిగారి లక్ష్మన్, ఎంగలి రాములు, ఎంగలి యాదయ్య, బొగ్గుల పెంటయ్య, సుతారి రాంబాబు, రామ చంద్రం, వడ్డె రాములు తదితరులు ఉన్నారు.