
తెలంగాణ రజక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో రజక సంఘం నూతన కార్యవర్గాన్ని రజక సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం హనుమాన్ టేకిడి బీసీ సాధికారత భవన్ లో తెలంగాణ రజక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అత్తిలి ఆది నారాయణ అధ్యక్షతన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంఘం అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి తెలిపారు. తెలంగాణ రజక సంఘం నూతన కార్యవర్గం: రాష్ట్ర అధ్యక్షులుగా వడ్డే పల్లి సారంగపాణి, ఉపాధ్యక్షులుగా కుదురుపాక పోషం, ప్రధాన కార్యదర్శిగా చెంచాలపు శ్రీనివాస్ రావు, యూత్ అధ్యక్షులుగా కుమ్మరికుంట బిక్షపతి, రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా తంగెళ్ల తిరుపతి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా వైనాల సంపత్, అధికార ప్రతినిధిగా పావురాల బిక్షపతి, ములుగు జిల్లా అధ్యక్షులుగా గుమ్మడెల్లి లక్ష్మణ్, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా వైనాల సదానందంలు ఎన్నికైనట్లు సారంగపాణి తెలి పారు. రజకుల హక్కుల సాధన కోసం పాటుపడతానని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను రజకులకు అందేలా కృషి చేస్తానని చెప్పారు