ఎల్లారెడ్డిలో రౌడీ పాలన కొనసాగుతుంది: వడ్డేపల్లి సుభాష్ రెడ్డి 

Rowdy rule will continue in Ellareddy: Vaddepalli Subhash Reddy– సమయం వచ్చినప్పుడు ఎమ్మెల్యే పి ఎ ల చరిత్ర విప్పుతా 

– భౌతిక దాడులు కాదు, ప్రజాపాలన పై దృష్టి పెట్టండి 
– కాంగ్రెస్ కార్యకర్త అనీఫ్ కు మదన్మోహన్ వర్గీయుల బెదిరింపు, చెరుకు తోట దగ్ధం 
నవతెలంగాణ – రామారెడ్డి 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగితే, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో రౌడీ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి శనివారం పత్రిక సమావేశంలో అన్నారు. మండలంలోని రంగంపేట కాంగ్రెస్ కార్యకర్త మహమ్మద్ అనీఫ్ పై మదన్మోహన్ రావు వర్గీయులు శుక్రవారం సాయంత్రం భౌతిక దాడులు చేసి, కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేశారని, అని తల్లి మనస్థాపం చెంది గుండెపోటుతో ఆసుపత్రి పాలైందని, ఆమెను కామారెడ్డి ఆస్పత్రిలో పరామర్శించి రంగంపేట అనీఫ్ ను పరామర్శించడానికి సుభాష్ రెడ్డి వర్గీయులు వస్తున్నారని తెలుసుకొని, అనీఫ్ కు చెందిన రెండేకరాల చెరుకు తోటకు నిప్పంటించారని ఆరోపించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సుభాష్ రెడ్డి ఫోటోలు పెట్టుకోవద్దని భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, మీ తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ఒకటికి పదిసార్లు అనుభవించవలసి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గంలో దాదాపు 186 గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ స్టిక్కర్ను అతికించి కాంగ్రెస్ పార్టీని బతికించిన కార్యకర్తలపై దాడులు ఏంటని ప్రశ్నించారు. ఒక సంవత్సరం ఆరు నెలల క్రితం మహమ్మద్ అనీఫ్ కు కాంగ్రెస్ లోకి ఆహ్వానించి ఇప్పుడు భౌతిక దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి లో పెండింగ్ పనులను, బొంపల్లి సమస్యను, ఆరోగ్యానికి అమలుపై దృష్టి పెట్టాలని, బ్యానర్లు, ఫోటోలపై రాజకీయం చేయడం ఎమ్మెల్యేకు తగినది కాదని సూచించారు. నిన్ను గెలిపించినందుకు ఎల్లారెడ్డి ప్రజలు బాధపడుతున్నారని,  పిఏలు సిద్దు, వికాసుల చరిత్ర సమయం వచ్చినప్పుడు విప్పుతానని హెచ్చరించారు. మదన్మోహన్రావు ఒంటెద్దు పోకడతోనే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎంపీ ఎలక్షన్లకు 40 వేల మెజారిటీ తగ్గిందని అన్నారు.జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గీ రెడ్డి మహేందర్ దాడిని ఖండించారు. కార్యక్రమంలో నా రెడ్డి శ్రీనివాసరెడ్డి, షరీఫ్, స్వామి రెడ్డి, సంతోష్, రాజేశ్వర్ రెడ్డి, బాల్ రడ్డి , లింగారెడ్డి,మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.