– సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిల మల్లు
నవతెలంగాణ-నేరేడ్‌మెట్
వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర కోశాధికారి గండికోట కుమార్ అధ్యక్షతన మౌలాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 కులా లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డెరలను మరిచి పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ విస్మరించారన్నారు. నేడు వడ్డెర కార్పొరేషన్ లేకపోవడం తో వడ్డెరలు ఆందోళన చెందుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వడ్డెరలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నా రు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విసుగు చెందిన వడ్డెరులు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. కానీ వడ్డెరలను విస్మరించిందని తెలిపారు. ఇటీవల 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వడ్డెర కులాన్ని మర్చిపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్డెరలకు న్యాయం చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎత్తరి గణేష్, వరి కుప్పల వెంకటేష్, రాష్ట్ర వైస్ చైర్మెన్, దేవరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భిక్షం, వెంకటేష్, శ్రీశైలం, రాష్ట్ర కార్యదర్శులు తిరుపతి, మల్లేష్, శ్రీనివాస్, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సాయి కుమార్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రాజు, వెంకటరమణ, చెన్నయ్య, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.