వడ్డెర సంఘం రాష్ట్ర జెఏసి కన్వీనర్ వీరబాబుకు పితృవియోగం 

నవతెలంగాణ -తాడ్వాయి 
వడ్డెర సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ తుర్క వీరబాబు తండ్రి తుర్క అప్పయ్య (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం మధ్యరాత్రి నర్సాపూర్(పిఏ)లోని ఆయన సొంత నివాసంలో మృతి చెందారు. వారి కుటుంబం అభ్యుదయ లెఫ్ట్ భావాలు గల కుటుంబం. ఆయన మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఆయనకు భార్య నారమ్మ, ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. గురువారం ఆయన అంత్యక్రియలు శోభాయమానంగా జరిగాయి. బంధువులు, వివిధ పార్టీల నాయకులు, ఆదివాసి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మహిళలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి, శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపాన్ని ప్రకటించారు.