
నవతెలంగాణ-గోవిందరావుపేట : ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు నాయకులు వడ్డెర కులస్తులను ఓటరుగా ఉపయోగించుకొని వదిలి వేస్తున్నారని వడ్డెర సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ తురక వీరబాబు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం పస్రా గ్రామం లో తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో చల్ల శీను అధ్యక్షతన సమావేశంఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డెర సంఘం రాష్ట్ర జేఏసీ కన్వీనర్ తురక వీరబాబు హాజరై మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్న వారిని కేవలం ఓట్ల వరకే ఉపయోగించుకొని, ఎటువంటి ప్రభుత్వ పథకాలకు నోచుకోని కులం అంటే అది వడ్డెర కులం అన్నారు. డీఎన్టీలో ఉన్న వాళ్లను బీసీ లో చేర్చారు కావున దీన్ని సవరించి ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మద్దతిస్తుందో ఆ పార్టీకే మా మద్దతు అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉప్పు తల్ల కోటి, జిల్లా అధ్యక్షులు ఆలకుంట రమేష్,జిల్లా నాయకులు గండికోట వెంకటస్వామి,మండల అధ్యక్షులు పల్లపు రాజు, యూత్ అధ్యక్షులు శ్రావణ్, కుల పెద్దలు యువకులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.