వడ్లకొండ శ్రీనివాస్ ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతల స్వీకరణ..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్ ముత్తన్నపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన పదోన్నతుల్లో ప్రధానోపాద్యాయుడిగా పదోన్నతి పొందారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యాయుడిగా వడ్లకొండ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బాలుర ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీరాములు, ఉపాధ్యాయులు నారోజు శంకరా చారి, రామంచ రవీందర్, ధనలక్ష్మి, శ్రీ విద్య వడ్లకొండ శ్రీనివాస్ ను శాలువ కప్పి సన్మానించారు. పాఠశాలలో ప్రవేశాలను మేరుగుపర్చి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని ప్రధానోపాద్యాయుడు వడ్లకొండ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.