
పెద్ద కొడపగల్ మండలంలోని వడ్లమ్ ఉన్నత పాటశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక అయినట్లు పి.ఈ.టి. ధర్మేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నాడు వరంగల్ పట్టణం లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫౌండేషన్ పోటీలలో బాగంగా అండర్ 14 విభాగం కుస్థి పోటీలలో ప్రథమ స్థాయి సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయింది.రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో ప్రథమ స్థానం సాధించి పాఠశాలకు పెరు తీసుకు వచ్చిన సుజితను పాఠశాల ఉపాద్యాయులతో పాటు గ్రామస్తులు అభినందించారు. జాతీయ స్థాయి పోటీలలో రానున్న కొద్ది రోజుల్లో ఛత్తీస్గఢ్ లేదా ఢిల్లీలో కుస్తీ పోటీలు జరగుతయని ఆయన తెలిపారు.