
పీఆర్టియూ టీఎస్ రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షులుగా పెద్దవూర మండలం ఎంపీపీ ఎస్ బెట్టేలతండా ప్రధానోపాధ్యాయులు వడ్లపల్లి వెంకటేశ్వర రెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోషామీర్పేటలో ఎస్ఎన్ ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన 35వ రాష్ట్ర మహాసభలలో ఎన్నుకున్నారు. ఈ ఎంపికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు మణికుమార్ ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, మండల అధ్యక్ష కార్యదర్శులు దండ వీరారెడ్డి, శివ,మహేష్,లకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి ఎన్నిక పట్ల మండల అసోసియేటర్ అధ్యక్షులు పాపిరెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు దేవేందర్, రూపా రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు.