సర్కార్ ది హడావిడే తప్ప వడ్లు కొంటలే: ఎమ్మెల్యే

Sarkar will buy rice except the Hadawide: MLAనవతెలంగాణ – దుబ్బాక 
“వరి కోతలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభమే కాలేదు.అప్పుడే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం విడ్డూరంగా ఉంది.రైస్ మిల్లుల్ని కేటాయించ లేదు.రాష్ట్ర సర్కార్ ది హడావిడే తప్ప వడ్లు కొనడం లేదు” అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు.ఇప్పటికే అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని.. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్,ధర్మాజీపేట వార్డుల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,  మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ కే.రమేష్ కుమార్,మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్,కౌన్సిలర్లు గోనేపల్లి దేవలక్ష్మి సంజీవరెడ్డి,దివిటి కనకయ్య,బత్తుల స్వామి,పీఏసీఎస్ ఛైర్మెన్ శేర్ల కైలాష్,మెప్మా సీఈవో రేణుక, ఆర్పీలు,బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు.