– యూఏఈపై 10వికెట్ల తేడాతో గెలుపు
– అండర్-19 ఆసియాకప్
షార్జా : ఆసియాకప్ అండర్-19 క్రికెట్ టోర్నీలో భారత బ్యాటర్, 13ఏండ్ల వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. యూఏఈ అండర్-19తో బుధవారం జరిగిన గ్రూప్ లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 44 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. రాయన్ అత్యధికంగా 35 పరుగులు చేశాడు. యుదజిత్ గుహకు మూడు, చేతన్ శర్మ.. హార్దిక్ రాజ్‌లు చెరి రెండు వికెట్లు పడగొట్టారు. 138 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 143 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 13ఏళ్లకే ఐపిఎల్‌లో కోటి రూపాయల జాక్‌పాట్ కొట్టిన వైభవ్ సూర్యవంశీ(76), ఆయుష్ మాత్రే(67) పరుగులతో రాణించారు. వైభవ్ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి.
సెమీస్‌లో భారత్ × శ్రీలంక ఢీ
బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌తో ఆసియాకప్ అండర్-19 లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. గ్రూప్-ఎలో 2వ స్థానంలో నిలిచిన భారత్.. గ్రూప్-బిలో టాప్‌లో ఉన్న శ్రీలంకతో సెమీస్‌లో తలపడనుంది. లీగ్ దశలో భారత యువ జట్టు పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. మరో సెమీస్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది. 6న సెమీఫైనల్స్, 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పాయింట్ల పట్టిక
గ్రూప్-ఎ
పాకిస్తాన్ 3 3 0 +1.94 6
ఇండియా 3 2 1 +2.55 4
యుఎఇ 3 1 2 +0.33 2
జపాన్ 3 0 3 -4.42 0
గ్రూప్-బి
శ్రీలంక 3 3 0 +1.28 6
బంగ్లాదేశ్ 3 2 1 +0.91 4
నేపాల్ 3 1 2 -0.74 2
ఆఫ్ఘనిస్తాన్ 3 0 3 -1.41 0