వైద్య నారాయణ ధన్వంతరి జయంతి వేడుకలు

నవ తెలంగాణ- మిరు దొడ్డి : వైద్య నారాయణ ధన్వంతరి జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో వైద్య నారాయణ ధన్వంతరి జయంతి వేడుకలను నాయి బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని నాయి బ్రాహ్మణుల అధ్యక్షుడు పయ్యావుల యాదగిరి ఆధ్వర్యంలో ధన్వంతరి చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పూలమాలలు వేశారు. పూర్వకాలంలో ఆయుర్వేదం ద్వారా వైద్య వృత్తిని కనుగొన్న ఘనత ధన్వంతరిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు నర్సింలు, శ్రీనివాస్, తిరుపతి, ఆంజనేయులు, శ్రీకాంత్, నరేందర్, శివ కుమార్, యాదగిరి పలువురు పాల్గొన్నారు.