వైద్య విధాన పరిషత్ ను రద్దుచేయాలి

జేఏసీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్
జేఏసీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్
– డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ గా మార్చాలి…
– జేఏసీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
వైద్య విధాన పరిషత్ ను వెంటనే రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ గా మార్చాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టి వి వి జే ఏసి) చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు.  శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో కోఠి లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు కింద ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలన్నారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 317 జీఓ తో సంబంధం లేకుండా ప్రమోషన్లు కల్పించాలని కోరారు.వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇవ్వాలని కోరారు. జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాలకు డిసిహెచ్ఎస్ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ వారి వద్దకు వచ్చి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నానని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సామల మల్లన్న. ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు