వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.

నవతెలంగాణ – అచ్చంపేట:  పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు ఉత్సవాల నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర ద్వారా దర్శనం , ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులు  కౌన్సిలర్  శివ తెలిపారు. ఆలయానికి 25000.విరాళం. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి బృంగి  జ్యోతి , రాజశేఖర్  దంపతులు 25000 విలువచేసే డోలు,  గంటా విరాళంగా ఇచ్చారు.. కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రసాద్ స్వామి, తదితరులు ఉన్నారు.