జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణాధికారిగా వైశంకర్..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం భవనంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉత్తమ ఆరోగ్య విస్తరణ అధికారిగా ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న మండల ఆరోగ్య విస్తరణ అధికారి యెనుగందుల శంకర్ ను నగర మేయర్ దండు నీతూ కుమారి, జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్ సుదర్శనం చేతుల మీదుగా అవార్డు, మేమెంటో, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అన్నింటిని ప్రజలలోకి తీసుకెళ్లడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వై .శంకర్ కు ఈ అవార్డు లభించింది. కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, కుటుంబ శాశ్వత పద్ధతులు,  తాత్కాలిక పద్ధతుల యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో వై. శంకర్ కీలకపాత్ర వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సరిత, మండల వైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.