నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వైష్ణవి మెడికల్ సీటు సాధించింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వైష్ణవి మెడికల్ సీటు సాధించడం కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని లలిత నగర్ కాలనీ లో నివాసం ఉంటున్న గిరీష్- సంధ్య ల కుమార్తె నీట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి ములుగు మెడికల్ కాలేజీలో సీట్ రావడం పట్ల తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి పెద ప్రజలకు సేవ చేస్తానని వైష్ణవి తెలిపారు.