నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వాజ్పేయి జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలని బీజేపీ జిల్లా నాయకులు ధరణికోట నరసింహా అన్నారు. బుధవారం మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో బారత రత్న ఆటల్ బిహారి వాజపేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాజపా జిల్లా నాయకులు ధరణికోట నర్సింహ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, రాజకీయాల్లో యువత రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నవ భారత నిర్మాణం కోసం కృషి చేస్తూ, సుపరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు, కొత్తపల్లి చంద్రశేఖర్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు నువ్వుల వెంకటేష్, దూసరి సురేష్, నాయకులు జ్యోతుల మల్లేశం,గాదె శివ ప్రసాద్, బొంగు సాయిరాం, చెరుకుపల్లి మహేష్, బింగి గౌరీ ప్రసాద్, సంజయ్ లు పాల్గొన్నారు.