మండలంలోని హాసాకొత్తుర్ గ్రామంలో స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతల పండుగలో భాగంగా గంగపుత్రులు వలగొడుగు పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామం నుండి గ్రామదేవతల ఆలయాల వరకు వల గొడుగుతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు, పిల్లా పాప, గొడ్డు గోదా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోమ్ముల రజినీకాంత్, కార్యదర్శి కుందారం శ్రావణ్, ఉపాధ్యక్షులు రాజుల చిన్న బాబయ్య, క్యాషియర్ రాధారపు నర్సయ్య, రైటర్ పెద్ది ధన్ రాజ్, ఖాతాదారు కొమ్రే అంజీ , సభ్యులు లింబద్రి, ఆదర్శ్, గణేష్, భారత్, వినయ్, ఉదయ్, కృష్ణ, రాజేష్, సాయన్న, శ్రీను, రవితేజ, చైతన్య, శివప్రసాద్, సురేష్, చిన్న గౌడ్, ఈశ్వర్, రవితేజ, నర్సయ్య, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.