నవతెలంగాణ-భువనగిరి రూరల్
తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు వల్లందాస్ ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుధవారం తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్‌ను భువనగిరి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమరేందర్ కీ ఆర్డీవో కార్యాలయంలో అందజేశారు. భువనగిరి అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు , తెలంగాణ ఉద్యమ నాయకులు వల్లందాస్ ఆదినారాయణ నామినేషన్ వేయడంతో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నాయకులతో పాటు జిల్లాలో ఉన్న పద్మశాలి సంఘం నాయకులు ఆ సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ చింతకింది శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మ రవీందర్, నాయకులు నీల భాను ప్రసాద్ లు పాల్గొన్నారు.